ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రేషర్స్ డే సంబరాలు

హాజరైన డిఐఈ గోపాల్,పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి


శుక్రవారం పరకాల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల్లో స్నేహపూరిత వాతావరణం పెంపొందించడానికి ఫ్రెషర్స్ డే వేడుకను నిర్వహించారు.ఈ కార్య్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎ గోపాల్,పరకాల సి ఐ క్రాంతి కుమార్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి సంతోష్ కుమార్,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌస్ పాషాలు హాజరై,ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్,అధ్యాపకులతో కలిసి సరస్వతీ మాత చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఏ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ, సంస్కారవంతంగా పెద్దల పట్ల గౌరవం కలిగి,లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు.జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశాయాలకు అణుగుణంగా ముందుకుసాగుతూ,చెడు అలవాట్లకు దూరంగా ఉండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు.పరకాల సి ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఇంటర్మీడియట్ దశ అని,భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోవడానికి చేరుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి ఇంటర్మీడియట్ స్థాయి విద్యను అధ్యాపకుల సలహాలు,సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని అన్నారు.మరి ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో సెల్ ఫోన్ వాడకుండా,చెడు అలవాట్లకు దూరంగా ఉంటు తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కాలంతో పోటీపడుతూ సాంకేతికను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.అదే విధంగా చదువుతో పాటు సంస్కారంతో సమాజంలో ముందుకెళ్లాలని తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలకు ధీటుగా తమ కళాశాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.అనంతరం చదువులో ప్రతిభ కనబరిచిన, రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్తులు ప్రదర్శించిన దేశభక్తి, ఆధ్యాత్మిక,జానపద నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!