భద్రాచలం నేటి ధాత్రి
యొక్క నిర్లక్ష్య వైఖరితోనే రిలే నిరాహార దీక్షలు. సోందేవీరయ్య.
భద్రాచలం శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోంది వీరయ్య మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని షెడ్యూల్ ప్రాంత పాలనాధికారులకు విన్నవించినా మా యొక్క సమస్యలను గాలికి వదిలేశారని దీర్ఘకాలికంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించి భద్రాచలంలో ఒక న్యాయ కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమని ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని ఐటీడీఏ పిఓ కి సోందే వీరయ్య విజ్ఞప్తి చేశారు
భద్రాచలంలో ఆదిమతెగలకు ఇంటర్ డిగ్రీ విద్యార్థుల కోసం పర్ణశాల గెస్ట్ హౌస్ స్థానంలోSMH సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ను పునరుద్ధరించాలి.
పర్ణశాల గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పూర్వ కాలేజీ SMH నిరుపు యోగంగా ఉన్నందున నిధులు మంజూరు చేసి మరమ్మత్తులు చేయించాలని అన్నారు .గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 45 జీవోను విడుదల చేసి భద్రాచలంలో మూడు గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిందని అన్నారు ఈనెల 30న ఐ టి డి ఏ ఎదుట ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు కొనసాగిచుటకు పిఓ కి ముందుగానే 12 డిమాండ్లతో కూడిన మెమొరండం నోటీసు ఇచ్చి ఉన్నామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పూనెం నాగేశ్వరరావు రిటైర్డ్ పి పి గారు కోటా దేవదానం ఆదివాసి లాయర్ల పోరం జిల్లా అధ్యక్షులు చీమల నరసింహారావు మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ పాయం సన్యాసి తూర్సం విజయ తల్లం లక్ష్మి కారం సుధా పాయం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు..