ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్ లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన నిరుపేద ఆదివాసి పిల్లలు వేసుకున్న చినిగిపోయిన బట్టలను చూసి చెలించి పోయిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ ఆ పిల్లల అందరిని బట్టల షాపుకు తీసుకువెళ్లి పిల్లలకు నచ్చిన కొత్త బట్టలు కొత్త చెప్పులు కొనివ్వడం జరిగింది, వారికి కొత్త బట్టలు కొనివ్వడంతో పిల్లల ముఖంలో వేలకట్టలేని చిరునవ్వును చూసి మురిసిపోయిన చైర్మన్ అయిలి మారుతి అలాగే ఆ పిల్లలందరూ చదువుకోవడానికి కూడా సహాయక సహకారాలు అందిస్తానని వారి తల్లిదండ్రులకు తెలిపారు అయిలి మారుతి చేసిన మంచి పనిని చూసి డిడబ్ల్యుఓ చిన్నయ్య ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషణ రేగొండ మండల్ ఇన్చార్జ్ ఆకుల ప్రతాప్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్,కన్వీనర్ బోనాల మధు, యూత్ ఇంచార్జ్ చింతకింది రాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు