మాదిగ సంక్షేమ సంఘం, రామవరం అంబేద్కర్ భవన్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్. రామా టాకీస్ ఏరియా కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గుడివాడ రామ్ లక్ష్మణ్ 75 ఈరోజు మృతి చెందారు. ఆయన 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా కొత్తగూడెంలో విద్యార్థి దశలోనే పాల్గొని, కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా పనిచేసే ఎంతోమంది కి సేవ చేశారు. దళిత నాయకుడిగా దళిత ఉద్యమంలో పాల్గొని అనేక హక్కులు సాధించి దళిత బాంధవుడిగా ఆయనకి మంచి పేరు ఉన్నది. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా నాయకులు ఆవునూరి సంజీవరావు, కొత్తూరు మదనయ్య, బొంకూరి పోశం మాటేటి అంజయ్య, ఇల్లందుల పోచయ్య, నమిల్ల మధు, ఐ ఎన్ టి యు సి నాయకులు గౌస్ భాయ్,రాధాకృష్ణ, బచ్చు తదితరులు పాల్గొన్నారు.