
మండల పార్టీ అద్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన బి ఆర్ఎస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక జిల్లా పార్టీ అద్యక్షురాలు గండ్ర జ్యోతి వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దతి మార్చుకోవాలని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేయాలని అన్నారు
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటు రాజకీయం కోసం అని దని వాళ్ళ ప్రజల దృష్టిని పక్కదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేరని రేవంత్ ప్రభుత్వం రైతులను ఇబ్బద్దులు పెడుతుందని ఋణమాఫీ పేరుతో అనేక ఆంక్షలు పెట్టి రైతులను నట్టేట ముంచుతున్నారని 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా తెలంగాణ తల్లి ఉద్యమ చరిత్రను కెసిఆర్ పేరును లేకుండా చేయాలని చేస్తున్నారని ప్రజల పక్షాన ఎన్నికల హామీల అమలు కోసం నేతృత్వంలో ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు మాజీ సొసైటీ ఛైర్మన్ పొరెడ్డి పూర్ణచంద్రారెడ్డి నాయకులు బైరగాని కుమారస్వామి గంజి జనయ్య మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి గండు శ్రీధర్ కడారి ఓదెలు పల్లెబొయిన సదయ్య ఎలబోయిన భద్రయ్య గాదె శేఖర్ చడా సర్వేషాం అల్లూరి శ్రీనివాస్ బొట్ల స్వామి మార్త సుధాకర్ విష్ణు వాజీద్ బుక్యా రమేష్, తదితరులు పాల్గొన్నారు