ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

– ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ సౌజన్యంతో
– కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ, ఎస్.పి అఖిల్ మహాజన్
– నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ రాష్ట్రంలోనీ అత్యున్నతమైన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మహిళలకు నిర్వహించడం జరిగినది. నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించగా నోటి క్యాన్సర్ విభాగాన్ని నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, ప్రారంభించారు. ఈ పరీక్షలో భాగంగా 25 సంవత్సరాలు పైబడిన మహిళలకు, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ , మామోగ్రామ్, ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ సైటోలజీ, మరియు సర్వైకల్ బయాప్సీ పరీక్షలు చేయడం జరిగినది. 25 సంవత్సరాల పైబడిన మహిళలలో తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి,చేతిలో గడ్డలు ఉన్నవారికి మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలోని టోటల్ ఓపి 164 కాగా, నోటి క్యాన్సర్ పరీక్షలు 31 పురుషులకు మరియు 43 మహిళలకు ,రొమ్ము క్యాన్సర్ 39 మందికి ,గర్భాశయ క్యాన్సర్ 51 మందికి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కేకే మహేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు, వేములవాడ ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ తిలక్ రాజ్ , డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రజిత ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమ్ జహ, డాక్టర్ లక్ష్మీప్రసన్న, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్వేశ్వర్ ప్రసాద్, కాముని వనిత పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, శ్రీదేవి,వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు కి షాదీ ఖానా ఇంచార్జ్ మహమ్మద్ సలీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విధమైన సేవలను ముందు ముందు కూడా కొన్ని సాగించవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *