అభివృద్ధిలో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకం

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

గ్రామాల అభివృద్ధిలో స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.సోమవారం ఉదయం శాయంపేట మండల కేంద్రం లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఇతర శాఖల అధికారులతో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీపి ప్రత్యేక అధికారులు పంచాయి తీ కార్యదర్శులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందు తాయని అన్నారు. పంచాయ తీ కార్యదర్శులు ప్రతీ రోజూ గ్రామంలో పర్యటిస్తూ ప్రజాసమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా గ్రామాల్లో ఫాగింగ్ చేయా లని కోరారు. బతుకమ్మ, దసరా, దీపావళీ పండగల దృష్ట్యా అన్ని గ్రామాలల్లో ఏర్పాట్లు ఇప్పటినుండే చేసుకోవాలని సెక్రటరీలకు సూచించారు. మండలంలో ఉన్న క్రషర్స్ యజమానులతో అధికారులు మాట్లాడి వారి సహకారం తీసుకుని గ్రామాలలో ఉన్న గుంతలను డస్ట్ తో పూడ్చాలని అన్నారు.

బాలకార్మికుల నివారణ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ప్రజ్వల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ – వరంగల్ వారికి చెందిన భారత సుస్థిర పత్తి యాజమాన్యపథకం(మారి )వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలకార్మికుల నివారణకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్ధను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు మొత్తం రూ.3,04,500/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటున్నాడని తెలియజేయడం జరిగింది మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబా లకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపరచు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు ,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *