నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రెడ్లవాడ సొసైటీ వైస్ చైర్మన్ సంపత్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంపత్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవులు, మైపాల్ రెడ్డి, మంగళ బాబు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, సురేందర్, సురేష్, సూరయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.