
నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిదిలోని శ్రీ కృష్టవేణి హై స్కూల్లో హిందీ బాష దినోత్సవాన్ని నిర్వహించారు. హిందీ భాషా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో విద్యార్థులచే హిందీ బాష సంస్కృతిక కార్యక్రమాలు, బాష నైపుణ్యత కోసం వ్వాసరచన,గేయాలు,పోటీలు నిర్వహించడం జరిగింది.ప్రధానోపాధ్యాయులుబత్తిని దేవన్న మాట్లాడుతూ హిందీ భాష ప్రస్థానం చాలా పురాతనమైనదని, భారతదేశ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం హిందీ భాషకు కలదు అని,1949 సెప్టెంబర్ 14 నుండి హిందీ భాష అనేది ఒక జాతీయ బాషగా మన రాజ్యాంగం గుర్తించిందనీ,ప్రపంచ దేశాలలో కూడ బాష ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్దులను,ఉపాధ్యాయులను అభినందించారు.