
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీమున్సిపాలిటీ పరిధిలోగల పదో వార్డులోని పోచమ్మ ఆలయంలో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు గణపతికి మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు.వార్డులోని మహిళలు, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, పోచమ్మ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వేద పండితులు నిశాంత్ శర్మచే ఘనంగా చేపట్టారు.
కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ
సకల జనులు సౌభాగంతో సుఖ సంతోషాలతో జీవించాలని అష్ట ఐశ్వర్యాలు ఆ సిద్ధి గణపతిని వేడుకొని పూజలు నిర్వహించామని తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో
తాళ్ళపెల్లి కళ్యాని,నాగిశెట్టి ప్రణీత, ఎదురబోయిన,మౌనిక,అదర్సండె రమదేవి,రావిళ్ళ పద్మజ,రావిళ్ళ సుమతి,దూసరి సంపూర్ణ, ర్పసరుగొండ మానస,కటకం రాజకళ , తౌటం వెన్నెల,బొల్లా సుమ, గందె కోటేశ్వరి, బెజ్జంకి మౌనిక,రాళ్ల బండి సరోజన,కొలువుల వసంత, కొలువుల కోకిల,బండి మాదవి,కొలపద్మ వార్డు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.