చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామంలోని క్రింది వాడకట్టు గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం రోజున ఆదిదేవునికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు, మహిళలు యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజించారు. అలాగే ఈ రోజున 108 రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
కట్ట లింగంపేటలోని గణనాధునికి కుంకుమ పూజలు.
