#అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.
#మాజీ సర్పంచ్ ఫోరంల మండల అధ్యక్షుడు నానబోయిన రాజారాం యాదవ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దాడి చేసిన ఘటన సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా చలో హైదరాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను అదుపులోకి తీసుకుని ముందస్తు అరెస్టు చేసి ప్రి వెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అని ఎస్సై ప్రశాంత్ బాబు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నానబోయిన రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతోనే బి ఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పోరాట ప్రతిమతో రాష్ట్రాన్ని సాధించమో, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలకు వివరించి మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను గద్దెనెక్కించేంతవరకు తమ పోరాటం ఆగదని పోలీసులు సైతం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గుమ్మడి వేణు, గోనెల నరహరి, బూస సదయ్య, పాండవుల రాంబాబు, తంగెళ్ళ వేణు, ప