
డిపిఎం రవి
మొగులపల్లి నేటి ధాత్రి
మహిళా శక్తి పథకాలను సద్వినియోగం చేసుకొని..మహిళలు ఆర్థికంగా ఎదగాలని డిపిఎం రవి మహిళా శక్తి లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. గురువారం సెర్ప్ – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ..వెలుగు మండల సమాఖ్య మొగుళ్ళపల్లి ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలు (పాడి గేదెలు, ఆవులు, పెరటి కోళ్ల పెంపకం లబ్ధిధారులకు మండల కేంద్రంలోని రైతు వేధికలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బండారి మంజుల అధ్యక్షతన మహిళా శక్తి లబ్ధిధారులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి డిపిఎం రవి మహిళా శక్తి లబ్ధిధారులను ఉద్దేశించి మాట్లాడారు. పీ.ఎం.ఇ.జీ.పీ పథకం కింద 35 శాతం సబ్సిడీతో బ్యాంకు ద్వారా మహిళా శక్తి లబ్ధిదారులకు లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాకేష్ మాట్లాడారు. పాడి గేదేలు,ఆవుల రకాలు, ఫీడింగ్ ఎలా చేయాలి, ఎన్ని లీటర్ల పాల దిగుబడి చేయొచ్చు, ఏ ఏ వ్యాధులు వస్తాయి. ఎలా వైద్యం చేయాలనే విషయాలపై లబ్ధిధారులకు అవగాహనణ కల్పించారు. పెరటి కోళ్లు, నాటు కోళ్ల పెంపకంలో 4, 5 నుంచి 6 వారాల వరకు లాభాలు పొందవచ్చన్నారు. ఈ సదస్సులో ఎంపీడీవో హుస్సేన్, డిపిఎం నారాయణ, ఏపీఎం అంబాల రవివర్మ, ఏపీఓ హలీమ్, ఆకినపల్లి ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ అనిల్, సీసీలు బాపురావు, శ్రీనివాస్, ప్రవీణ్, విఓఏలు, మహిళా శక్తి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.