భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు పిర్యాదు
వరంగల్ నేటిధాత్రి
వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న శేషు భారతి అధికార దుర్వినియోగం పట్ల విచారణ చేయాలని, ఈవో ను భద్రకాళి దేవాలయం నుండి బదిలీ చేయాలని వరంగల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. పిర్యాదులో పేర్కొన్న విషయం ప్రకారం, భద్రకాళి దేవస్థానం నందు భక్తులకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, భక్తులను దూషించడం పరిపాటిగా జరుగుతుంది అని, భక్తులు సమర్పించే కొబ్బరికాయలు కొట్టినానంతరం, టెండర్ దారుడు వాటి నుంచి వచ్చే నీటిని తిరిగి భక్తులకే అమ్ముతున్నారని, అమ్మవారికి భక్తులు వారి కోరికలను మానసికంగా అర్పిస్తూ, వారి కర్మలను టెంకాయ రూపకంగా సమర్పించడం జరుగుతుంది అని, అలాంటి నీటిని ఇతర భక్తులకు డబ్బులకు ఇవ్వడం అశుభ్రంగా భావిస్తున్నాము. కావున టెండర్ దారునిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ వెంటనే టెండర్‌ను రద్దు చేయవలసిందిగా కోరుతూ, కొబ్బరికాయలు, పూలు అమ్మే టెండర్ దారుడు దేవాలయం నిర్ణయించిన రుసుము కంటే 200శాతం అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ భద్రకాళి ఈవో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. అలాగే
అత్యంత ప్రధానమైన అంశం భద్రకాళి అమ్మవారికి భక్తులు సారే రూపకంగా అందించే చీరల్లో, అతి ఖరీదైనవి తక్కువ రేటు కోడ్ చేస్తూ, బయట అధిక రేట్లకు అమ్ముతూ, వారి అనుకూలమైన వ్యక్తులకు లెక్క పత్రం లేకుండా సమర్పిస్తున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచిత చెప్పుల స్టాండు వద్ద దేవాలయ ఉద్యోగుల్లోని ఒక వ్యక్తి మనుషులను పెట్టి చెప్పుల స్టాండ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ, డబ్బులు ఇవ్వని వారిని దూషణలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో దౌర్జన్యాలు చేస్తూ, భక్తులకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని దీనిపై తగు విచారణ చేసి ఆ ఉద్యోగిపైన, శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కంటికి కనబడుతున్న మేరకే ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే, దేవాలయ ఆడిటింగ్ విషయంలో ఇంకెన్ని లోపాలు జరుగుతున్నాయో గమనించవలసిందిగా కోరుతూ, వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి తగు విచారణ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలా పలు అంశాలలో జరుగుతున్న పొరపాట్లను, అక్రమాలను భద్రకాళి ఈవో దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకుపోగా, వారికి అనుక్షణం సహకారం అందిస్తున్నారు. కావున ఈవో శేషు భారతి విధి నిర్వహణలో కూడా చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి, వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకుంటూ, భద్రకాళి దేవస్థానం నుండి మార్చవలసిందిగా కోరుతూ, తగు విచారణ చేసి తప్పు చేసిన ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే టెండర్ దారులు దేవాలయ విధివిధానాలను ఉల్లంఘించినందున వెంటనే టెండర్‌ను క్యాన్సల్ చేసి కొత్త టెండర్‌దారులను పిలువవలసిందిగా వారు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. ఉచిత పార్కింగ్, ఉచిత పాదరక్షల స్టాండులను యధాతరంగా కొనసాగించవలసిందిగా కోరుతూ డిప్యూటీ కమిషనర్ కు పిర్యాదు చేశారు. పిర్యాదు చేసిన వారిలో రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి నాగరాజుగౌడ్, ఎన్. రాజు, సూరం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.