గొల్లపల్లి నేటి ధాత్రి:
అంగన్వాడి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ జానకి అన్నారు. గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ నిర్వహణలో భాగంగా పోషణ మాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ జానకి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పిల్లలు తీసుకోవలసిన పోషక నియమాలపై అవగాహన కల్పించారు. పాలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గూర్చి వివరించి చిన్నారులకు అన్నప్రాసన అక్షరాభ్యాస కార్యక్రమాలు,గర్భవతులకు శ్రీమంతాలు నిర్వహించారు. పిల్లలకు ఎత్తు బరువులు చూశారు. ప్రతి ఒక్కరు వారి వారి ఇండ్లలో న్యూట్రిన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జానకి, అంగన్వాడి టీచర్ సైండ్ల రజిత,ఆశ కార్యకర్త లత గర్భవతులు, బాలింతలు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.