
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ధర్నాలో పాల్గొని ప్రసంగించిన అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వ, గొడిషెల తిరుపతి గౌడ్, బోయిని తిరుపతి, బీర్ల పద్మ, బామాండ్లపెల్లి యుగంధర్, మచ్చ రమేష్, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు, లంకదాసరి కళ్యాణ్, నాయకులు చెంచల మురళీ, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, కాశెట్టి లక్ష్మణ్, మామిడిపెల్లి హేమంత్ కుమార్, బొడ్డు రాజు, గరిగే రాములు, శారద, నల్లగొండ శ్రీనివాస్, గాండ్ల రమేష్, ఎగుర్ల మల్లేశం, జక్కుల ఆగయ్య,సి.హెచ్ సాయిలు, నన్నవేని కొమురయ్య, బాగోతం వీరయ్య, ఒర్సు కొమురయ్య, కెంసారం శ్రీనివాస్, కడారి బీరయ్య, ఎం.శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.