మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పాడుగుల రాజేశ్వరీ-సంపత్ ల కుమారుడు పాడుగుల శివకుమార్ మండలంలోని ఇస్సిపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో 10వ తరగతి వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదువులకు మరిపెడలోని గురుకులంలో చదివి వృత్తిరీత్యా వ్యాయామ ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వహిస్తున్నాడు. 2012 నుండి ఖోఖో ఆటలో అత్యున్నత ప్రదర్శన కనబరుస్తూ ఎన్నోసార్లు వరంగల్ జిల్లా టీం నుండి ఆడి తనదైన రీతిలో గుర్తింపుగా పేరు తెచ్చుకొన్నాడు. తెలంగాణ టీం నుండి పాలు మార్లు క్రీడాకారుడిగా, కోచ్ గా గుర్తింపు పొందాడు. 2024-25 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు నిర్వాహకులుగా తాను పని చేసే పాఠశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్ లో ఖోఖో బాలుర జట్టుకి హెడ్ కోచ్ గా నియమితులు అయ్యాడు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ..నన్ను ప్రోత్సహించిన మేన మామ గుత్తికొండ బాలకృష్ణ, కోచ్ లు సురేష్, సదానందం, విజేందర్ లకి ఆయన ప్రత్యేక ధన్యవాదములు తెలిపాడు.