మాలొతు లింగునాయక్
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లాశాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరుపుల బాలు ఇల్లు కూలి పోవడంతొ ఎక్కడ తలదాచుకోవాలో దీనస్థితిలోనున్న కుటుంబాన్ని చూసి చలించిపోయిన మాలొతు లింగునాయక్ తనవంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మాలోతు లింగునాయక్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు తన ఇంట్లో నిత్యవసర సరుకులు మరియు దుస్తులు, బియ్యం అంతాపాడైపోయింది. ఎక్కడ తల దాచుకోవాలని కూడా తెలియని పరిస్థితి వారిది, రోజు ఇద్దరు భార్య భర్తలు కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ పెద కుటుంబానికి ప్రకృతి ఇలా ఇంటిని కూల్చడం పై తన బాధను తెలియపర్చారు. మండల అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎం ఎల్ ఏని స్వయముగా వెళ్లి వారికి సహాయం చేయమని కొరతనని తెలియపర్చారు.ఈ కార్యక్రమములో మాలోతు భాష,బలరాజ్, మాలోతూ చరణ్. శోభన్ గణేష్,రాజు, సరోజన ,రాకేష్,జరుపుల సునీల్, అనిల్,జీవన్, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు.