గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్

వరంగల్ మండిబజార్లో గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు

గంజాయి అమ్మిన, అక్రమ రవాణా చేసిన,గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం…

ఇంతేజార్గంజ్ సీఐ మచ్చ శివ కుమార్.

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ మండిబజార్లో గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు. వివరాల్లోకి వెళితే కాజీపేట మండలం, శాయంపేటకు చెందిన షేక్ రషీదా బేగం (38) అనే మహిళ, తన ఇంట్లో గొడవల వల్ల మానసికంగా చాలా కృంగిపోయి, దాంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన తోటి, బల్లర్షా నుండి గంజాయిని తీసుకొని వచ్చి అమ్మితే, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసుకొని, అప్పుల బాధను భరించలేక ఏంచేయాలో తోచక, నిందితురాలు గత పదిహేను రోజుల క్రితం బల్లార్షా వెళ్లి అక్కడ ఖలీమ్ అనే వ్యక్తి దగ్గర సుమారు అర కిలో గంజాయి 3000రూపాయలతో కొని తీసుకునివచ్చి, వరంగల్ మండిబజార్ ఏరియాలలో చిన్న చిన్న ప్యాకెట్లను చేస్తూ, అక్కడ మసీద్ వద్ద గంజాయి తాగే వ్యక్తులకి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుండేది. అదే క్రమంలో బుధవారం రోజున అట్టి గంజాయిని, చిన్నగా ప్యాకెట్లు తయారుచేసి అమ్ముదామని, ఒక సంచిలో సుమారు ఒక పావు కిలో గంజాయి పెట్టుకొని, వరంగల్ మండిబజార్ ఏరియా దగ్గరలోని, మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా, అంతలోనే పెట్రోలింగ్ పోలీసువారు రాగా, పోలీసులను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారని ఇంతేజార్గంజ్ సిఐ మచ్చ శివకుమార్ మీడియాకు తెలిపారు. నిందితురాలి నుండి 6250 రూపాయల విలువ చేసే 250గ్రాముల గంజాయి, తన వద్ద గంజాయ్ అమ్మిన డబ్బులు 3050రూపాయలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది అని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ఇంతేజార్గంజ్ సిఐ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మిన, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకుని గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!