# దుగ్గొండి ఎంపీడీఓ లెక్కల అరుంధతి.
నర్సంపేట,నేటిధాత్రి :
15 నుండి 18 సంవత్సరాలలోపు బాలికలతో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయాలని దుగ్గొండి ఎంపీడీఓ లెక్కల అరుంధతి అన్నారు. స్నేహ (సేఫ్టీ నుట్రిషన్ ఏమ్పోవేర్మేంట్ హెల్త్ అండ్ అడోలేసేన్స్) కార్యక్రమంలో బాలిక సంఘాల ఏర్పాటు కోసం దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రశాంతి మండల సమాఖ్యలో మంగళవారం వివోఏలకు శిక్షణ శిభిరం నిర్వహించారు.బాలిక సంఘాల ఏర్పాటుతో ఆడ పిల్లలో ఆత్మ స్తైర్యాన్ని నింపాలని 15 నుండి 18 ఏళ్ల లొపు కౌమార దశ బాలికలకు వయసుతో పాటు శరీరంలో ఏర్పడే మార్పులు మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహనా కల్పించే బాధ్యత శిక్షకులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఈవో డ్వాక్ర పద్మజా, ఏపిఎం గుజ్జుల రాజ్ కుమార్, ఎంఎస్ అధ్యక్షురాలు లలిత, కోశాధికారి సావిత్రి, ఐసిడిఎస్ లీగల్ కో అర్దినటర్ జయరాణి, తరుణి కో అర్దినటర్ కవిత,హెల్త్ సూపర్ వైజర్ మనోజ,సి.సిలతో పాటు 43 గ్రామా సంఘాలకు చెందిన వి.వో.ఏ లు పాల్గొన్నారు.