కాశీబుగ్గ, నేటిధాత్రి
వరంగల్ తూర్పులో కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రతి యేట ఘనంగా నిర్వహిస్తారు. 2024 గణపతి ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్ర కాలం పూజ అనంతరం, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, గుళ్ళపల్లి రాజకుమార్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి, ములుక సురేష్, దాసి శివకృష్ణ, కూరపాటి సతీష్, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.