నేటిధాత్రి అక్షర పోరు!

రో హౌస్‌ల కూల్చివేతలు షురూ!!

-నేటిధాత్రి చిత్రపురిపై అక్షర విజయం.

-ఒక్కొక్కటిగా రో హౌస్‌ ల నేలమట్టం!

-కూల్చివేతలు ఇప్పుడే మొదలయ్యాయి.

-చివరి ఇల్లు కూల్చిదాకా ఆగదు.

-చిత్రపురిపై నేటిధాత్రి సుదీర్ఘ అక్షర సమరం

-కార్మికుల పక్షాన అలుపెరుగని అక్షర యుద్ధం.

-నేటిధాత్రికి అభినందనల వెల్లువ.

– నేటిధాత్రి అక్షరానికి కార్మికుల జేజేలు.

-జరిగిన నిర్మాణాలు కూల్చివేత నేటిధాత్రి విజయమని కార్మికుల సంబరాలు.

-చిత్రపురి కార్మికులదే!

-చిత్రపురిలో సినీ గద్దలకు తావు లేదు.

-కార్మికులకు పూర్తి న్యాయం జరిగేవరకు నేటిధాత్రి అక్షరం విశ్రమించదు.

-చిత్రపురిలో వాలిన గద్దలకు వెన్నులో వణుకు.

-విర్రవీగిన వారికి నేటిధాత్రితో కలిసి కాలం చెప్పిన సమాధానం

-ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది.

-చిత్రపురి విషయంలో ఇంత కాలానికైనా అదే జరిగింది.

-సామాజిక బాధ్యతలో నేటిధాత్రి మరో నిరూపణ.

-ఎవరెన్ని విమర్శలు చేసిన వెరవలేదు.

-బెదిరింపులు చేయాలని చూసిన అదరలేదు.

-నేటిధాత్రి అక్షర శక్తి తెలియక అవాకులు చెవాకులు పేలారు.

-న్యాయం వైపు నిలిచిన నేటిధాత్రి నీ చూసి విస్తుపోతున్నారు.

-కార్మికులందరికీ న్యాయం జరగాలన్నదే నేటిధాత్రి ఆకాంక్ష.

-కార్మికుల సొంత ఇల్లు కల నెరవేర్చడమే నేటిధాత్రి లక్ష్యం.

-అప్పటి వరుకు నేటిధాత్రి పోరాటం ఆగదు.

-కార్మికుల కళ్ళలో ఆనందం చూసే వరకు అక్షర పోరు ఆపదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 బలమైన సంకల్పం ఎంతటి లక్ష్యానైనా చేధిస్తుంది. న్యాయం వైపు జరిగే పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. అక్షరాల నేటిధాత్రి సాక్షిగా ఇదే నిజమైంది. చిత్రపురిలో జరిగిన అక్రమ నిర్మాణాలైన రోహౌజ్‌ల కూల్చివేతలు మొదలయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. కేవలం కొన్ని రోహౌజ్‌లకు పర్మిషన్‌ లేదన్న కొన్ని ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న కూల్చివేతలే. చిత్రపురిలోని రోహౌజ్‌ల కూల్చివేతలు మొదలైన నుంచి కార్మికుల పెద్దఎత్తున నేటిదాత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేటిధాత్రి అక్షర పోరాటానికి జేజేలు పలుకుతున్నారు. చిత్ర పురి విషయంలో ఇప్పటి వరకు అలుపెరగని అక్షర పోరాటం చేసింది ఒక్క నేటిదాత్రి మాత్రమే అని కొనియాడుతున్నారు. మీడియా సంస్ధలు ఎన్ని వున్నా, కార్మికుల సాగిస్తున్న పోరాటానికి అండగా నిలిచింది ఒక్క నేటిధాత్రి మాత్రమే అంటూ కొనియాడుతున్నారు. తమ కష్టాలు గట్టెక్కే కాలం వస్తే అదంతా నేటిధాత్రి చలవే అవుతుందిన చెబుతున్నారు. అన్యాయమైన కార్మికులకు పూర్తి న్యాయం జరిగే రోజు వచ్చిన రోజు నిజమైన పండుగ అని, ఆ వేడుకను తెచ్చిన ఘనత కూడా నేటిధాత్రికే దక్కుతుందని సినీ కార్మికులు నేటిధాత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిత్రపురిలో రోహౌజ్‌లన్నీ అక్రమ నిర్మాణాలే. వాటికి వున్న పర్మిషన్లీ అక్రమమైనవే. కొందరు అధికారులు తెలిసీ తెలియక చేసిన పనుల వల్లనో, సీని పెద్దల మాటలు నిజమని నమ్మో వాటికి పర్మిషన్లు ఇచ్చారే తప్ప వాటిలో నిజం లేదు. ఆ నిర్మాణాలు సక్రమం ఎన్నడూ కాదు! ఈ విషయాన్ని పునాదిగా నేటిధాత్రి కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన అక్షర పోరాటం సాగిస్తోంది. మొదట్లో నేటిధాత్రి వార్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత నేటిధాత్రి మీద దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సినీ పెద్దలకు చెందిన కొంత మంది చెంచాలు పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. అసలు రోహౌజ్‌ల మీద వార్తలు రాస్తే బాగుండదంటూ బెదింపులకు గురి చేశారు. అయినా నేటిధాత్రి ఏనాడు భయపడలేదు. వారి బెదిరింపులకు అదరలేదు. నేటిధాత్రి మీద సినీ గద్దల అనుచరులు అవాకులు చెవాకులు పేలిన ప్రతి సందర్భంలోనూ మరింత చిత్రపురి మీద లోతైన వార్తలు రాస్తూనే వస్తోంది. ఎప్పటికైనా కార్మికులకు న్యాయం జరగాలన్న బలమైన సంకల్పంతో వార్తలు రాసింది.  

ముందు అన్యాయం ఊరేగినా, ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.

 అబద్దం ఎన్నటికైనా ఓటమి పాలౌతుంది. కార్మికుల కన్నీటి గాథలను రాసింది. కార్మికుల పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు తన అక్షరాలలో చూపింది. కార్మికుల కోసం కోట్ల విజయబాస్కరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సినీ గద్దలు వాలడం తప్పని హెచ్చరిస్తూనేవుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు దూరిన సినీ గద్దలను ఎప్పటికప్పుడు నేటిదాత్రి హెచ్చరిస్తూనేవుంది. ఉమ్మడి రాష్ట్రంలో సినీ కార్మికుల గూడు కల్పించాలన్న మంచి ఉద్దేశ్యంతో ఆనాటి పాలకులు ఇచ్చిన భూమిలో 14 ఎకరాలు సినీగద్దలు మింగేయాలని ఆనాడే కంకణం కట్టుకున్నారు. ఒకప్పుడు సినీ కార్మికుల పక్షపాతిగా వున్న తెలంగాణకు చెందిన నటుడు ప్రభాకర్‌ రెడ్డి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ రావాలని కృషిచేశారు. సినీ కార్మికులకు నీడ కల్పిస్తే సినీ కార్మిక లోకం హైదరాబాద్‌కు తరలివస్తుందని ఆలోచన చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పుడు చెన్నైలో వుండేవారు. తెలంగాణ నటులకు అప్పట్లో సినీ పరిశ్రమలో చోటు లేదు. ఒకప్పటి మద్రాసు ఆంద్రా ప్రాంతానికి చందిన నటులకు సమీపంలో వుండేది. పైగా సినిమా షూటింగులన్నీ అయితే మద్రాసులోనో, లేకపోతే ఆంద్రాలోనో జరుగుతుండేవి. దాంతో నటులు, ఇతర కార్మికులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లే ఎక్కువ వుండేవాళ్లు. అక్షరం ముక్క రాకపోయినా ఆంద్రా వాళ్లైతే చాలు..అన్నట్లుగా ఆధిప్యతం సాగేది. దాంతో సినీ లోకం అంటే ఆంద్రా అన్నంతగా మారిపోయింది. తెలంగాణ వారికి ఎలాంటి అవకాశాలు వుండేవి కాదు. దాంతో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివస్తే, తెలంగాణ కళాకారులకు కూడా అవకాశాలు వస్తాయి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రంలో నిర్మాణం జరుపుకున్నట్లు వుంటుంది. సినిమాలో తెలుగు దనం ఉట్టిపడుతుందనుకున్నారు. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు వస్తాయన్న ఆలోచన చేశారు. అయితే అప్పటికే మద్రాసులో స్ధిరపడిపోయిన నటులంతా అక్కడి నుంచి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 

సినిమా షూటింగులకు కాల్షీట్లను అనుసరించి, చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తూపోతుండేవారు.

 కాని కార్మికులు ఇచ్చే పారితోషంతో ఒక్కసారిగా హైదరాబాద్‌ వస్తే కష్టమౌతుందని చాల మంది రావడానికి ఇష్టపడలేదు. దాంతో హైదరాబాద్‌లో ఇండ్లు ఇస్తామంటే వస్తారని ఆలోచన చేసిన ప్రభాకర్‌రెడ్డి తన సొంత స్ధలంలో కొంత భాగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే స్టూడియోల కోసం కొంత మందికి పెద్ద ఎత్తున స్ధలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కార్మికులకోసం ప్రభుత్వం స్ధలం కేటాయిస్తే సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చేందుకు కృషి చేస్తానని ప్రభాకర్‌ రెడ్డి ప్రభుత్వానికి మాట ఇచ్చారు. దాంతో ఆయన కృషి ఫలించి, ప్రభుత్వం 69 ఎకరాల స్ధలం కేటాయించింది. కార్మికులు రూ.50 మొదలు రూ.500 సభ్యత్వంలో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో నగరం విస్తరించడం మొదలైంది. సినీ గద్దల కండ్లు ఆ భూమి మీద పడిరది. కార్మికులకు చెందిన భూమిలో కొంత భాగం లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాని అప్పటికే ప్రభుత్వం భూమిని కేటాయించిన సమయంలోనే కేవలం సినీ కార్మికులకే అంటూ జీవో జారీచేస్తూనే , కేవలం అప్పార్టుమెంట్ల నిర్మాణం మాత్రమే జరపాలని కూడా మెలిక పెట్టింది. కాలం గడిచే కొద్ది ఆ మెలికను మార్చేసే కుట్రకు సినీ గద్దలు కుట్రలు చేశారు. సినీ పెద్దలు అంటే ఎంతో కొంత ఇష్టమైన అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అన్న ఆలోచనతో రోహౌజ్‌ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. కాని అవి నిజమైన ఆదేశాలు కాదు. సినీ పెద్దలు లాక్కున్న పద్నాలుగు ఎకరాల్లో కూడా అప్పార్టుమెంట్ల నిర్మాణం మాత్రమే జరగాలి. జిప్లస్‌ , జివన్‌ ప్లస్‌ అని వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారు. 225 రోహౌజ్‌ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. వీటిపై ఆది నుంచి అభ్యంతరం వ్యక్తమౌతున్నా, కార్మికులు పోరాటం చేస్తున్నా వాళ్లను పట్టించుకున్న వాళ్లు లేరు. కార్మికులకు న్యాయం జరిగింది లేదు. 

కార్మికులకు అండగా నిలవాల్సిన వాళ్లు కొంత కాలానికి సినీ పెద్దలు దగ్గర చేసుకొని వాళ్లకు కూడా రోహౌజ్‌ స్ధలాలను కేటాయించారు.

 ఇది ఇంకా దుర్మార్గం. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చి కొన్ని సంవత్సరాలుగా నేటిదాత్రి కార్మికుల పక్షాన అక్షరపోరు జరుపుతోంది. ఇంత కాలానికి హైడ్రా పురుడు పోసుకోవడంతో అధికారులు రోహౌజ్‌ల మీద కొరడా రaులిపించేందుకు సిద్దమయ్యారు. కూల్చివేతలు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఆరంభం మాత్రమే… చిత్రపురిలో జరిగిన రోహౌజ్‌ల నిర్మాణాలన్నీ అక్రమమే. ఈ విషయం కింది స్ధాయి నుంచి పైస్ధాయి దాకా తెలుసు. అందుకే గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో న్యాయం చేస్తామని కూడా ప్రామిస్‌ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా కార్మికులకు తప్పకుండా న్యాయంచేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రాను తెచ్చి కూల్చేస్తున్నారు. కొన్నేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటం కూడా ఫలించినట్లైంది. కాని కొన్ని రోహౌజ్‌లు కూల్చివేస్తే సరిపోదు. మొత్తం రోహౌజ్‌లను కూల్చి వేసి, ఆ స్థలంలో సినీ టవర్స్‌ నిర్మాణం చేస్తే కార్మికులందరికీ న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు నేటిధాత్రి పోరాటం చేస్తూనే వుంటుంది. తన అక్షరాలతో కార్మిక లోకానికి అండగా నిలుస్తూనే వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!