ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని డిమాండ్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలో డిబిఎఫ్,డివైఎఫ్ఐ,ఎబిఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలనీ ధర్నా నిర్వహించారు.డిబిఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంబాల అనిల్,ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు.ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాలని డిమాండ్ చేసారు.అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రెయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనీ అన్నారు. రెయింబర్స్మెంట్ విడుదల చేయక ప్రైవేట్ విద్యాసంస్థలు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు.వెంటనే మధ్యాహ్న భోజనపథకాన్ని,రెయింబర్ర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిలుచొవాలని అన్నారు.సర్టిఫికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్న కాలేజ్ పర్మిషన్ రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు అభిరామ్ మనోజ్,ఈశ్వర్,నరేష్, రమేష్, రమ్య,సంధ్య, రజిని, అనూష విద్యార్థులు పాల్గొన్నారు.