*బంద్ కు మద్దతుగా ధర్నా రాస్తారోకో*
*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*
శాయంపేట, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాకు మద్దతుగా రైతు సంఘాలు అఖిలపక్షం నాయకులు ఇచ్చిన పిలుపు మద్దతుగా శాయంపేట మండలంలో ఎంసిపిఐ యు, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎమ్మార్పీఎస్, బహుజన సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ రైతు సంఘాలు అఖిలపక్ష నాయకులు బంద్కు మద్దతు తెలుపుతూ ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మందారపేట జాతీయ రహదారిపై ధర్నా
రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రము ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్లో ఆమోదించినప్పుడు వ్యతిరేకించకుండా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం అంటూ ద్వంద వైఖరి టిఆర్ఎస్ నాయకులు ఆల్ అందిస్తున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మండల నాయకులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు సన్నరకం ధాన్యం వేయాలని చెప్పి వేసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రైతులను మోసం చేసి నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల భాస్కర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు, అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ చేపట్టిన రైతు న్యాయ పోరాటం చేస్తున్న రైతులకు న్యాయం జరిగే వరకు
బహుజన సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
తెలుపుతున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకునే వరకు రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య అన్నారు.
*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*
రాష్ట్రంలో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని వ్యవసాయ
శాఖ అధికారులు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం చేయించిన
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన
సన్న రకం ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులకు
ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు నాయకులు హుస్సేన్, పరికరాల భూమయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దేవయ్య, ఏఐఎఫ్బి మండల నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, శ్రీను, రాజ్ కుమార్, రవీందర్, జగన్, సతీష్, బహుజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మగ్గం సుమన్, కార్యదర్శి మనోజ్,డివైఎఫ్ఐ అధ్యక్షులు మంద సురేష్,
అఖిలపక్ష నాయకులు రైతులు పాల్గొన్నారు.