వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో కర్నూల్ రోడ్లో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి వే సైడ్ మార్కెట్ యార్డ్ నిర్మించిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు . ఈ సందర్భంగా మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు . మార్కెట్ యార్డ్ లో 78 షాపులు ఉన్నాయని రైతుల స్వయంగా పండించిన కూరగాయలు పండ్లు అమ్ముకునే వారికి ఉచితంగా షాపులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు . ఇప్పటినుండి వనపర్తి పట్టణంలో రోడ్లపై కూరగాయలు పెట్టు కొని వ్యాపారం చేసుకునే అవకాశం లేదని అమ్మడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కూరగాయల అమ్మే సంఘాల వారితో మాట్లాడి వెంటనే వే సైడ్ మార్కెట్ యార్డుకు తరలించే ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు . రిటైల్ గా కూరగాయలు పండ్లు అమ్మే వ్యాపారస్తులకు ఉచితంగా షాపులు కేటాయించాలని అధికారులను కోరారు . జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రరావు డి పి ఆర్ ఓ సీతారాం ఇంజనీరింగ్ అధికారులు అధికారులు ఉన్నారు