పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

ముత్తారం :- నేటిధాత్రి

మండలంలో పెండింగ్ ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ముత్తారం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం కింద అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో ముత్తారం మండల తహసిల్దార్ సుమన్ డిప్యూటీ తహసీల్దార్ షఫీ సీనియర్ సహాయకులు భవాని ప్రసాద్ ఆర్ ఐ శ్రీధర్ జూనియర్ అసిస్టెంట్ త్రిజయ్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!