జైపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించిన సిపి ఎం. శ్రీనివాస్

ఫిర్యాదు చేసిన బాధితులకు వెంటనే స్పందించాలి

జైపూర్, నేటి ధాత్రి:

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, (ఐజి) ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు,వారు చేస్తున్న విధులు, పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బందితో మాట్లాడి డయల్ 100 కాల్స్ కి స్పందించి, వారు సంఘటన స్థలంకి చేరుకొన్న టైం వివరాలు ట్యాబ్ లో చెక్ చేయడం జరిగింది. నైట్ టైం లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా సేకరించాలని మరియు బ్లూ క్లోట్స్ సిబ్బంది విధులు అడిగి తెలుసుకోవడం జరిగింది. పెట్రో కార్ వాహనంలలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటక్ట్ రిబ్బన్, రైట్ గేర్ కిట్( హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ఫ్రొటెక్టర్) లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, ఇంపార్టెంట్ పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ మోహన్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!