అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మ
ముత్తారం :- నేటి ధాత్రి
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మ అన్నారు మంగళవారం ముత్తారం మండలంలోని పోతారం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుగ్యాల శ్రీనివాసరావు వీణ అంగన్వాడి టీచర్ శోభ విద్యార్థులతో పాటు పలువురు పాల్గొన్నారు