
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
భూపాలపల్లి నేటిధాత్రి
ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వమే సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కాటారం కేంద్రంగా జరిగే బహిరంగ సభ జయప్రదం కోసం చేసే ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మండలంలోని నందిగామ గ్రామంలో ఆగస్టు 9 అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1994 సంవత్సరం నుంచి 2014 వరకు రెండు దశాబ్దాల కాలంలో ఆదివాసులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలకు సూచించినప్పటికీ అభివృద్ధి చేయకపోగా కనీసం ఆదివాసి దినోత్సవం సందర్భంగా నైన ఆరోజునే సెలవు దినంగా ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమని వారన్నారు, ఈ ప్రభుత్వానికైనా ఆదివాసుల పట్ల వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆగస్టు 9న అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఆ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలో ఉన్న ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు స్వేచ్ఛగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి, ఆస్కారం ఉంటుందని వారు గుర్తు చేశారు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డి టి డి ఓ ఆఫీసుని వెంటనే ఏర్పాటు చేయాలని , అటవీ పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తైనేని శంకర్, తై నేని.రవి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొలం.చిన్న రాజేందర్,తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి గణేష్,తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా కమిటీ సభ్యులు తైనేని శ్రీరామ్,సంఘం సభ్యులు బొడ్డు సదానందం, లక్ష్మయ్య కాల్వపల్లి మల్లయ్య,తైనేని నాగేష్ గుండ్ల నారాయణ, సంఘం చిలుకల రాజయ్య,గంజి.గట్టయ్య, తేనెని సుధాకర్, కోలకని.నర్శిమ్ములు గ్రామస్తులు పాల్గొన్నారు