
నర్సంపేట,నేటిధాత్రి :
40 సంవత్సరాలు దాటిన మహిళలకు విటమిన్స్ లోపం వలన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విటమిన్స్ మాత్రలు అందించేందుకు గాను వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది.ఇందుకు గాను నరంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గురువారం పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు.అలాగే మండలంలో బాంజీపేట గ్రామంలో కార్యదర్శి స్నేహాలత,మదన్నపేట గ్రామంలో కార్యదర్శి సునీత,కమ్మపల్లిలో కార్యదర్శి మహేష్,బొజ్యానాయక్ తండాలో కార్యదర్శి అనిల్,నాగుర్ల పల్లి గ్రామంలో కార్యదర్శి హర్షవర్ధన్,రాజేశ్వర్ రావు పల్లిలో కార్యదర్శి కృష్ణవేణి,దాసరిపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి రవిచంద్రలు ఆశ కార్యకర్తలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్లు,గ్రామ పంచాయితీ సిబ్బందితో కలిసి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమారి మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని 40 సంవత్సరాలు నిండిన మహిళలను ఆధార్ కార్డు ప్రమాణికంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల సర్వేలో బాగంగా సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సర్వే కార్యక్రమాలలో చంద్రయ్యపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది భాష బోయిన సుధాకర్, ఉప్పుల సురేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ మాటేటి శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు కోమల, రాణి, పలువురు పాల్గొన్నారు.