యువ ఆటగాడికి క్రికెట్ బ్యాట్ అందజేత
విద్యార్థులకు పలు సందేశాత్మక పుస్తకాల బహుకరణ
అంతర్జాలానికి అంకితమవుతున్న విద్యార్థులను పుస్తకాల వైపు మళ్ళించాలనే ఆలోచనతో బి.ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పుస్తకాలతో పాటు క్రికెట్ బ్యాటును అందించడం సంతృప్తిగా ఉంది
__బిఆర్ఎస్వీ నేత విజయ్ కుమార్ పిన్నింటి…
నేటిధాత్రి, వరంగల్
కరోనా కాలం తరువాత విద్యార్థులు ఎక్కువ సమయం అంతర్జాలం గాలంలో పడి విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుందని బిఆర్ఎస్వి నేత పిన్నింటి విజయ్ కుమార్ అన్నారు. అందుకోసం బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి, యువతకు మార్గ నిర్దేశకులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వినూత్నంగా తనకు పలు వేదికల్లో వ్యాసరచన, క్విజ్ పోటీల్లో భాగంగా బహుమతిగా వచ్చిన పలువురు మహానుభావుల పుస్తకాలతో పాటు కొనుక్కున్న పుస్తకాలు, సేకరించిన పుస్తకాలను విజయ్ కుమార్ వరంగల్ లోని ఎ.వి.వి ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న క్రాంతి అనే విద్యార్థికి ప్రిన్సిపాల్ బుజేందర్ రెడ్డి సమక్షంలో పుస్తకాలు అందించి భవిష్యత్లో గొప్పగా చదివి ఉన్నత స్థానంలో ఉండాలని విద్యార్థికి విజయ్ కుమార్ శుభాభినందనలు తెలిపారు. క్రాంతి అనే విద్యార్థి తెలుగు భాషపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రిన్సిపాల్ ప్రోత్సహించడం శుభ పరిమాణం అని విజయ్ అన్నారు. కేటీఆర్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని, ఆయన ఆలోచన విధానాన్ని రేపటి భవిష్యత్ తరం కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నాననీ, కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందనీ విజయ్ అన్నారు. తన పుస్తకాలను నేటి తరం విద్యార్థి కోసం అందించి ప్రోత్సహించిన విజయ్ కుమార్ ఆలోచన విధానాన్ని ప్రిన్సిపాల్ అభినందించడం జరిగింది. అనంతరం లాల్ బహదూర్ కళాశాలలో బీకాం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న పవన్ క్రికెట్లో ప్రతిభ కనబరచడం చూసి నేడు పవన్ నివాసానికి వెళ్లి క్రికెట్ బ్యాటును అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి 11వ డివిజన్ అధ్యక్షులు నక్క వివేక్, తెలుగు అధ్యాపకులు శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.