సిపిఎం డిమాండ్.
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల పట్టణంలో అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్న అవేమి పట్టించుకోకుండా,రెగ్యులర్ కమిషనర్ ను నియమించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని సీపీఎం చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు విమర్శించారు, ఈ రోజు సీపీఎం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ముస్త్యాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ, చేర్యాల పట్టణంలో అనేక వార్డులలో చెత్తాచెదారంతో మురికి కాలువల సరిగా తీయకపోవడంతో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని వీరిని పట్టించుకోని సమస్యలు తీర్చాల్సిన కమిషనర్ వారానికి ఒకసారి వచ్చి చుట్టపు చూపుగా వచ్చి కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారని కనీసం మురికి కాలువల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి కూడా పట్టణంలో లేదని ఆరోపించారు,కొంతమంది కౌన్సిలర్లు తమ తమ వార్డులలో తమ చెత్త కంకర చెత్తను మోరీలలో వేస్తూ పాత బస్టాండ్ వద్ద ఉన్న మోరీలలో వేస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్న చిన్న చిరుజల్లులకే అంగడి బజార్ మొత్తం గుంతల మయంగా మారుతుందని స్కూలుకు కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఆ రోడ్డు వెంబడి నడవాలంటే భయపడుతున్నారని వారు అన్నారు, కొన్ని వార్డులలో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు ఎవరూ కూడా అందుబాటులో లేకుండా ఉన్న కొద్దో గొప్పో సిబ్బంది పట్టించుకోకపోవడంతో సమస్యలకు నిలయంగా చేరి పట్టణం మొత్తం సమస్యల తో నిండిపోయిందని వారు ఆరోపణ చేశారు,వెంటనే పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు, ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బండకింది అరుణ్,పట్టణ కమిటీ సభ్యులు పోలోజు శ్రీహరి, ఇప్పకాయల శోభ, బోయిని,మల్లేశం రాళ్ల బండి భాస్కర్, ఆముదాల నర్సిరెడ్డి, రాళ్లబండి చందు,కాటం రాములు, రంజిత్ రెడ్డి,ఎండినూర్బి, భామండ్లపల్లి రమ,యడారం బ్రమ్మయ్య, బియ్య సిద్ధులు, ఎస్ డి ఇబ్రహీం, ఎండి అస్గర్, తోడంగల రామచంద్రం, బొంగోని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.