12వ డివిజన్ సమస్యలు పరిష్కరించండి

బీజేపీ నేత గోకే వెంకటేష్

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 12వ డివిజన్ సమస్యలపై ప్రభుత్వ పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ నేత గోకె వెంకటేష్. 12వ డివిజన్ ప్రజలు అనునిత్యం ఇబ్బంది పడుతున్న సమస్యలపై, ప్రభుత్వ పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన గోకె వెంకటేష్ మాట్లాడుతూ, డివిజన్లో ముఖ్యంగా కుక్కల బెడదా, వీధిలైట్ల దీపాలు వెలుగకపోవడం మరియు వర్షాకాల సీజన్లో తీసుకోవాల్సిన చర్యలు, మున్సిపల్ అధికారులు తీసుకోకపోవడం వల్ల ప్రజలు మలేరియా డెంగు వ్యాధుల భారీన పడడం జరుగుతుంది. పలుమార్లు ఉన్నత అధికారులకు విన్నపించుకున్న ఫలితం లేదు అని అన్నారు. ఇప్పటికైనా తక్షణమే వివిధ శాఖ అధికారులు స్పందించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు గోకె వెంకటేష్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!