
https://epaper.netidhatri.com/view/328/netidhathri-e-paper-24th-july-2024%09
` సాప్ట్ వేర్ ఇంజనీర్లు మనుషులనుకుంటున్నారా?
`మరనుషులనుకుంటున్నారా!
`అలవాటు పడిన ఉద్యోగానిని వదులుకోలేక పని చేస్తారనుకుంటున్నారా!
`కార్మిక చట్టాలను ఇప్పటికే ఐటి కంపెనీలు తుంగలో తొక్కాయి.\
`ఇష్టం వచ్చినట్లు కొలువులు తీసేస్తుంటాయి.
`మన్డుకు గ్యారెంటీ రంగాల వ్యాపారం ఐటి.
`ఎప్పుడు వుంటుందో! ఎప్పుడు ఊడుతుందో తెలియని కొలువులు!
`కార్మిక చట్టాలు అమలుకు గండికొడతారా!
`8 గంటల సమయం దాటితే ఓవర్ టైమ్ అంటారు.
`ఐటి కంపెనీలు ఇప్పటికే 10 నుంచి12 గంటలు పని చేయిస్తున్నారు.
`14 గంటల పని చేయించడం అన్యాయం.
`పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది.
`చాలీ చాలని జీతాలు.
`వర్క్ ఫ్రమ్ హోం పేరుతో కాల్చుకుతింటున్నారు.
`ఆఫీసులకు వచ్చి 14 గంటల పని ప్రతిపాదనలు తెస్తున్నారు.
`కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు వంతపాడడం సరైంది కాదు.
`యువత జీవితాలతో ఆడుకోవద్దు.
`వారి భవిష్యత్తును ఆగం చేయొద్దు.
`చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో ఐటి ఉద్యోగులు సతమతమౌతున్నారు.
హైదరబాద్,నేటిధాత్రి:
చదివేస్తే వున్న మతి పోతుందన్నట్లు ఇటీవల పాలకులు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే వుంటున్నాయి. ఎన్నికల సమయంలో గెలవాలన్న తపనతోటి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతుంటారు. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ. ప్రాంతీయ అభిమానాలు మరింత ఎక్కువ. దాంతో తమ ఉపాది కోసం రాజకీయ పార్టీలు, పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అన్నది ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అందులో ప్రజల నుంచి ఎదురయ్యే సవాళ్లను పక్కన పెట్టి, ఓట్ల రాజకీయం మొదలు పెడతారు. ఎన్నికల్లో గట్టెందుకు రకరకాల వాగ్ధానాలిస్తుంటారు. తర్వాత ప్రజల చేత సర్కస్ ఫీట్లు చేయిస్తుంటారు. ఎన్నికల తర్వాత పర్యవసానాలు ఎలా వుంటాయన్నదానిని ముందు పట్టించుకోరు. తర్వాత ఇచ్చిన వాగ్ధానాల అమలులో పెల్లిమొగ్గలేస్తుంటారు. సరిగ్గా ఇక్కడ అదే జరుగుతోంది. కర్నాకట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సంస్ధలలో ఉద్యోగాలు కూడా స్ధానికులకు ప్రాదాన్యత కల్పిస్తామని చెప్పారు. దాంతో నిరుద్యోగ యువతలో ఒక ఆశ కలిగింది. కాని దాని సాధ్యాసాద్యాలు తర్వాత, పర్యసనాలు ఎలా వుంటాయన్నది పార్టీలు ఆలోచించవు. ఓట్ల సమయంలో పార్టీల మనోగతం ప్రజలు ఆలోచించరు. అదే ఇప్పుడు కర్నాకట ప్రభుత్వం ముందుకు వెళ్లలేక, వెనక్కి పోలేక చేస్తున్న ఆలోచనలు ఆఖరుకు నిరుద్యోగులకే కాదు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఇబ్బంది కరమైన పరిస్ధితులు సృష్టిస్తున్నాయి. సహజంగా ఇతర వ్యాపారాలు వేరు. సాఫ్ట్ వేర్ వ్యాపారం వేరు. ఇతర కంపనీలు వేరు. సాఫ్ట్ వేర్ కంపనీలు వేరు. సహజంగా ఫార్మా కంపనీ గురించే మాట్లాడుకుంటే స్ధానికుల ఉద్యోగాలలో ప్రాదాన్యత అంటే ఒక అర్ధం వుంటుంది. ఫార్మా కంపనీ ఏర్పాటు వల్ల లాభం ఎంత వుంటుందో స్ధానికంగా ప్రజలకు అంత నష్టం కూడ వుంటుంది. అందువల్ల ఆ కంపనీ వల్ల నష్టపోయే ప్రాంతాల యువతలో అర్హులైన వారికి ఉపాధి కల్పించడం చాల ముఖ్యం. కాని సాఫ్ట్ వేర్ రంగం అలా కాదు. కాని కర్నాకటలో జరిగిన ఎన్నికల్లో సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు స్దానికులకే కల్పించేలా చట్టం తెస్తామని చెప్పారు. అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. దాంతో ఇతర సమస్యలు తెరమీదకు వచ్చాయి. అదే జరిగితే కంపనీలు కర్నాకటకు వీడిపోయే ప్రమాదముందన్న ప్రచారం జోరందుకున్నది. దాన్ని కంపనీలు మర్చిపోయేందుకు కర్నాకట ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపనీలలో పనిచేసే వారు రోజుకు 14 గంటల పని చేయించాలని చూసే కంపనీలకు వత్తాసు పలికింది. ఆ మధ్య ఇన్ఫోసిస్ అధినేత రోజుకు 14 గంటల పని చేస్తే తప్పేముంది ఓ ప్రకటన చేసి వివాదం రేపారు. దేశ వ్యాప్తంగా అది పెద్ద చర్చ జరిగింది. రచ్చ రచ్చ అయ్యింది. దాంతో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కొట్టిపారేశారు. జనం కూడా మర్చిపోయారు. కాని తాజాగా కర్నాకట ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేయడంతో మరోసారి రచ్చ మొదలైంది.
సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం ఏమిటో గాని యువత జీవితాలను తారు మారు చేస్తున్నాయి.
ఉన్నత చదువులు మంచి ఉద్యోగాలు అన్న సంబరమే తప్ప జీవితంలో వారికి సంతోషం మిగలడం లేదు. సహజంగా ఏ శారీరక పరిశ్రమ చేసే కూలీకైనా పనిచేసి ఇంటికి వచ్చారంటే మరునాటి వరకు ఎలాంటి ఆలోచన లేకుండా జీవితం గడుస్తుంది. కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా వుంటుంది. పేరు వీకెండ్ తప్ప వారంలో ఏడు రోజులు డ్యూటీ ద్యాస తప్ప మరొకటి వుండదు. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోం అంటూ పనులు మొదలయ్యాయో! అప్పటి నుంచి వారి జీవితాల్లో ఆనందం లేకుండాపోయింది. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జీతాలు లెక్కలోకి తీసుకొని మాట్లాడుకుంటాం. కాని వారి జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను గురించి ఎవరూ చర్చించుకోరు. ఐదంకెల జీతం ముందు సమస్యలన్నీ బలాదూర్ అనుకుంటారు. అసలు చిక్కంతా అక్కడే వుంది. వారంలో రెండు రోజులు సెలవులు. కాని ఆ రెండు రోజులను కూడా మిగతా ఐదు రోజుల్లో వారి నుంచి వసూలు చేస్తున్నారన్న సంగతి మనం మర్చిపోతాం. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానైనా కార్మికుల చట్టాలన్నవి గొప్పగా వున్నాయి. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలన్నదానిపై కూడా ఒక లెక్క వుంది. సహజంగా అసంఘటిత రంగంలో సమయం కనిపించదు. కాని ఉదయం పనికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుతుంటారు. కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పరిశ్రమలలో పనిచేసే కార్మికులకన్నా దుర్భరమైన జీవితాలే అనుభవిస్తున్నారు. కాకపోతే పైకి కార్మికుడిలా కనించకపోవచ్చు. కాని కార్మికుడికన్నా ఎక్కువ కష్టం చేయాల్సివస్తోంది. సమస్యలను ఎదుర్కొవాల్సివస్తుంది. ఇప్పటికే సాప్ట్వేర్ ఉద్యోగులు 10 గంటల నుంచి12 పని చేస్తున్నారు. నిజానికి మన దేశంలో ఏ పనైనా 8 గంటలు మాత్రమే వుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే విర్తంపజేస్తున్నారు. కాని సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఎనమిది గంటలు కాస్త 10 గంటలైంది. యువత కూడా అందుకు అంగీకరించారు. ఎందుకంటే వారంతంలో శనివారం కూడా సెలవు దొరుకుతుండడంతో జీతాలు కూడా సమృద్దిగా వుండడంతో ఒప్పుకున్నారు. కాని సాప్ట్వేర్ రంగం ఎంత విస్తరించిందో, అంతే విధంగా ఆ రంగం వైపు పెద్ద ఎత్తున యువత మళ్లింది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడమే మొదలైంది. కంపనీల సంఖ్య తగ్గింది. నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. దాంతో జీతాలు దిగివచ్చాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు లక్షల ప్యాకేజీకి కూడా యువత క్యూ కడుతున్నారు.
ఓ వైపు తక్కువ జీతాలైనా సరే పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా 14 పనిగంటలను తెరమీదకు తేవడాన్ని ఐటి ఉద్యోగులు తప్పు పడుతున్నారు.
ప్రజలకు మేలు చేయాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలకులు కూడా ఇలా కంపనీలకు మేలు జరిగే విధంగా ఆలోచనలు చేయడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. శారీరక శ్రమ చేసేవారికన్నా, మైండ్ వర్క్ చేసేవారు తొందరగా అలసిపోతారు. పైగా ఆనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కూర్చున్న చోట నుంచి కదలకుండా పది గంటలు పనిచేయడమే పెద్ద సమస్య. అయినా ప్రతి ఉద్యోగి అదనంగా మరో రెండు గంటలు పనిచేయాలన్న నిబంధనలు తెచ్చినా పనిచేస్తున్నారు. ఇక వర్క్ ఫ్రమ్ హోం వల్ల మేలు జరుగుతందనుకుంటే, ఉద్యోగులు తీవ్రమైన మానసిక సంఘర్షణలకు గురౌతున్నారు. ఇంట్లో వుండి పనిచేస్తున్నామనే తృప్తి తప్ప, ఎన్ని గంటలు పనిచేస్తున్నామనే ఆలోచన లేకుండా రోజంతా పనిచేస్తున్నారు. పైగా వర్క్ ఫ్రమ్ హోం వల్ల ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఒత్తిడితో కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేంత తీరిక లేకుండాపోతోంది. ఆఫీస్కు వెళ్లిన సమయంలో కనీసం వారంలో ఒక్క రోజైనా కుటుంబంతో గడిపే అవకాశం వుండేది. ఇప్పుడు రోజూ ఇంట్లో వున్నట్లే అయినా, కుటుంబానికి సమయం ఇవ్వలేక సతమతౌతున్నారు. ఇదిలా వుంటే గత కొంత కాలం క్రితం వరకు ఆఫీసుకు రాకున్నా ఫరవాలేదన్న కంపనీలు మళ్లీ ఖచ్చితంగా వారంలో మూడు రోజులైనా ఆఫీసులకు రావాలంటూ కొత్త ఒత్తిడి చేస్తున్నాయి. కరోనా సమయంలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే పనులు చేశారు. ఇప్పుడు మళ్లీ కంపనీలకు తప్పకుండా రావాలంటే జీతాలు పెగలేదు కాని బెంగుళూరులో పెరిగిన ఇంటి అద్దెలు జీతంలో సగం సమర్పించుకోవాల్సి వస్తుంది. జీతమంతా ఇంటి అద్దెలకే ఊడ్చుకుపోతోందని సతమతమౌతుంటే, రోజుకు 14 గంటల పని అని పిడుగులాంటి వార్తలు వినాల్సిరావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో వారు మానసిక సమస్యలే కాదు, విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముంది.