ఎక్కడి రాజకీయం అక్కడే..గప్‌ చుప్‌!

https://epaper.netidhatri.com/view/327/netidhathri-e-paper-22nd-july-2024%09

-ఒక్కసారిగా నిశ్శబ్దం.

-తెలంగాణ రాజకీయాలలో ప్రశాంతత.

-మొన్నటి దాకా హాట్‌, హాట్‌గా…

-కొంత కాలంనిరుద్యోగుల అలజడి…

-పరీక్ష నిర్వహణతో ఆవహించిన శూన్యత.

-గ్రూప్‌ పరీక్షల వాయిదాతో మరింత మాయమైన గందరగోళం.

-రుణమాఫీతో బిఆర్‌ఎస్‌కు మాటలు లేవు.

-ప్రశ్నించడానికి సమస్యలు లేవు.

-ఐదేళ్ల తర్వాత రాజకీయాలలో స్తబ్థత.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 తెలంగాణలో వాతావరణమేకాదు, రాజకీయాలు కూడా ఒక్కసారిగా చల్లబడ్డాయి. మొన్నటిదాకా వాతావరణం వేడిమీద వున్నట్లే రాజకీయ పార్టీలు కూడా వేడి మీద వుండేవి. కాని ఒక్కసారిగా విచ్చన మార్పుకు కారణాలు అనేకం వున్నాయి. అయినా ఇలాంటి పరిస్ధితులు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి నిశ్శబ్దరాజకీయాలు సాగుతుండేవి. కాని గత పదేళ్ల కాలంలో ఏనాడు ప్రశాంతమైన రాజకీయాలు లేవు. బిఆర్‌ఎస్‌ పాలన సాగించినంత కాలంలో కూడా ఏదో ఒక రకమైన వివాదం నిత్యం వుంటూనే వుండేది. కాని కొద్ది రోజులు తెలంగాణ రాజకీయాలు ఇంత ప్రశాంతను సంతరించుకోవడం అంటే ఒక రకం రాష్ట్రం సుహృద్భావమైన పరిస్ధితుల్లో వుందనే అనుకోవాలి. గత వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఏం జరగనున్నదన్నంతంగా సోషల్‌ మీడియా విపరీతమైన ప్రచారాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల మేరకు ఉద్యోగాల నోటిఫికేష్‌ ప్రకటనలు జారీ చేసింది. గత పదేళ్ల కాలంలోనే ఉద్యోగ వాతావరణం తెలంగాణలో మళ్లీ కనిపించింది. కాని వివాదాలు బాగానే ముసిరేలా చేయాలని చాలా మంది చూశారు. పైగా బిఆర్‌ఎస్‌ పార్టీ చేయాల్సింత రాజకీయం చేయాలనే చూసింది. కాని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిస్ధితులను చాలా బాగా హాండిల్‌ చేశారనే చెప్పాలి. ఒక దశలో డిఎస్సీ వాయిదా పడుతుందన్నంతగా లేని పోని ప్రచారం సాగించారు. ఉద్యమాల పేరుతో రోడ్డెక్కారు. పిడికెడు మంది లేని ఉద్యమాన్ని సైతం వేలల్లో వున్నట్లుచూపించారు. కేవలం కోచింగ్‌ సెంటర్లు వున్న ప్రాంతాలను ఎంచుకొని అక్కడి అభ్యర్ధులను రోడ్లమీదకు తీసుకొచ్చారు. అర్ధరాత్రుళ్లు హల్‌ చల్‌ చేయించారు. చివరికి పోలీసులు లాఠీ చార్జిలుచేసే దాకా పురిగొల్పారు. ఈ విషయంలో కోదండరామ్‌ను కూడా లాగాలని చూశారు. మరో మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని కూడా అబాసుపాలు చేయాలని చూశారు. ఒకప్పుడు కోదండ రాముడిగా నిరుద్యోగులు బావించిన కోదండ రాం..ఇప్పుడు కో దండగ రాం అంటూ నినాదాలు చేయించారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయించారు. అయినా ఆయన కూడా ఎంతో సంయమనం పాటించారు. రెచ్చగొట్టే రాజకీయాల ఉచ్చులో పడొద్దనుకున్నారు. 

పాలపొంగులాంగి కృత్రిమ ఉద్యమం చప్పున చల్లారి పోవడం తధ్యమని వారికి తెలుసు.

 పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వర్గం కూడ అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. ఎక్కడా ఏ మంత్రి నోరు జారలేదు. ఇక్కడ బ్యాలెన్స్‌ తప్పలేదు. అందుకే ఉద్యమం కూడా ముందుకు వెళ్లలేదు. లేకుంటే ఉద్యమం పక్కదారి పట్టేది. ప్రభుత్వం ఇబ్బందుల పాలయ్యేది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. డిఎస్సీ అభ్యర్ధుల వెనుక ఎవరున్నారో తెలుసుకొని వారిని నోరు మూయించే ప్రయత్నం చేయించారు. ఉద్యమాన్ని పరీక్షల ద్వారానే ఆపాలన్న వేసిన ఎత్తుగడ సత్పలితాన్నిచ్చింది. హాల్‌టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. పరీక్షలకు హజరయ్యారు. చివరి ప్రయత్నంగా కొంత మంది కోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. మొత్తానికి ఒక్కసారిగా డిఎస్సీ అభ్యర్ధుల ఉద్యమం ఆగడం బిఆర్‌ఎస్‌కు ఆశనిపాతంగా మారింది. ఎందుకంటే ఆపార్టీకి చెందిన వ్యక్తే ముందు ఈ ఉద్యమానికి ఆజ్యం పోశారు. శ్రీకారం చుట్టాడు. కాని ఆయన అనుకున్నది సాధించలేకపోవడం కొసమెరుపు. డిల్లీ వెళ్లి ఉద్యమం చేస్తామన్న వాళ్లంతా హైదరాబాద్‌ గల్లీ కూడా దాటలేందంటే ఉద్యోగార్ధులతో ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నారో తేలిపోయింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా గందరగోళలంలోకి నెట్టేసినంత పనైంది. బిజేపి కూడా ఒక రకంగా విస్తుపోయిందనే చెప్పాలి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీద ప్రతిపక్షాలు పదే పదే విరుచుకుపడుతున్న సందర్భం చూస్తూనే వున్నాం. ప్రతీసారి ఆరు నూరైనా సరే ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతూనే వస్తున్నారు. కాని ప్రతిపక్షాలు ఆయన మాటలను వక్రీకరిస్తూ వచ్చాయి. ఎట్టిపరిస్ధితుల్లోనూ రుణమాఫీ సాధ్యమయ్యేది కాదంటూ కేసిఆర్‌ కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో చెప్పడం, రేవంత్‌రెడ్డిని విమర్శించడం మొదలుపెట్టారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాగైనా రుణమాఫీ చేసి తీరాలన్న పట్టుదలతో వుండడంతో రుణమాఫీకి మార్గం పడిరదనే చెప్పాలి. 

 శాసన సభ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఎంతో ప్రధానమైనందే ఈ రుణమాఫీ.

 డిసెంబర్‌ 3న అధికారంలోకి వస్తాం..రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డి 84 సభల్లో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు రావడం వల్ల రుణమాఫీ సాధ్యం కాలేదు. దాంతో పార్లమెంటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగష్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రజలకు మరోసారి హమీ ఇచ్చారు. అప్పటి నుంచి బిఆర్‌ఎస్‌ రుణమాఫీ కాదన్నట్లు చెబుతూ వచ్చారు. కాని బిఆర్‌ఎస్‌ పదేళ్లలో చేయలేని పనిని ఖచ్చితంగా చేసి తీరాలని సిఎం. రేవంత్‌రెడ్డి బలంగాకోరుకున్నారు. అన్నట్లుగానే ఆగష్టు 15 వరకు పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడత రుణమాఫికీ శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సుమారు 40లక్షల మందికి పైగా లక్షలోపు రుణాలున్న రైతు కుటుంబాలున్నాయి. వారందరకీ ఏక కాలంలో రుణమాఫీ చేయడం అన్నది గొప్ప కార్యక్రమం. రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని బిఆర్‌ఎస్‌ చూసింది. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచి వస్తున్న జడి వానను బిఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోయింది. పదేళ్ల పాటు అదికారంలో వుండి రైతు రుణ మాఫీ చేయలేని వాళ్లకు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. పైగా రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్‌రావు గతంలో ప్రకటించారు. దానికి కట్టుబడి వుండాలని కాంగ్రెస్‌ పెద్దఎత్తున ప్రచారం సాగిస్తోంది. దాంతో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే తాను రాజనామా చేస్తానని అన్నట్లు హరీష్‌రావు చెప్పుకొచ్చారు. దాన్ని కాంగ్రెస్‌ ఖండిరచింది. అటు డిఎస్పీ పరీక్షలు మొదలు కావడం, గ్రూప్‌ పరీక్షలు వాయిదా వేయడం అనే రెండు పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఒక్కసారి డీఎస్సీ వాయిదా వేస్తే, అది అక్కడితో ఆగదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన అడుగు వెనక్కి వేయలేదు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం లేనిపోని సమస్యలకు తలొగ్గితే, ఇక అదే అలవాటు చేసుకుంటారు. ఈ డిఎస్సీ ఇంత కాలం తమ సమయం కోల్పోయిన వారికి, కొత్త డీఎస్సీ త్వరలో వేసి, యువతరానికి అవకాశం కల్పిస్తామని చెప్పి వారిలో భరోసాని నింపడంలో ప్రభుత్వం సక్సెస్‌ అయ్యింది. ప్రభుత్వం మాట విని లక్షలాది మంది పరీక్షలకు సిద్దమయ్యారు. డిఎస్సీ రాస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వివాదం కూడా లేకుండా పరీక్షల నిర్వహణతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన సత్తాను చాటుకున్నది. ఇటు పరీక్షల నిర్వహణ, అటు రుణమాఫీ వంటి వాటితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందనే చెప్పాలి. అయితే కొసమెరుపు ఏమిటంటే ఈ ఉద్యమాలపై బిజేపి అంటీ మట్టనట్లు వుండడం విచిత్రం. బిజేపి పెద్దగా ఈ ఉద్యమాలను పట్టించుకోలేదు. రైతు రుణమాఫీపై కూడా పెద్దగా స్పందించలేదు. ఏక కాలంలో రుణమాఫీ అన్నారు..మొత్తం చేయలేదన్నదానిపై బిజేపి స్పందిస్తుందని అనుకున్నారు. కాని రుణమాఫీకి మార్గం పడడమే చాలు..రైతు సంతోషంగా వున్నప్పుడు అనవసరమైన రాజకీయాలు చేయొద్దని బిజేపి వ్యూహాత్మకమైన మౌనం పాటించింది. బిఆర్‌ఎస్‌ పార్టీ తెల్లమొహం వేసింది.pe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!