స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి సత్తా చాటాలి.
తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బాలరాజు నేత.
లింగాల ఘనపూర్ (జనగామ) నేటి ధాత్రి :-
ఐక్యతతోనే పద్మశాలిలకు రాజకీయ భవిష్యత్తు ఉంటదని. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పద్మశాలి సత్తా చాటాలని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల బాలరాజు నేత పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కారంపూడి చంద్రయ్య తల్లి దశదినకర్మకు హాజరయ్యారు అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు మనదే ఐకమత్యంతో అందరూ కలిసికట్టుగా ఉండి పద్మశాలి సంఘాన్ని మరింత బలోపేతం చేద్దామని ఆయన అన్నారు. అప్పుల బాధ తో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్సిగేసియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా పద్మశాలి ఉన్నారని రాజకీయ శక్తిగా ఎదగాలని కోరారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పద్మశాలి సంఘం ప్రచార కార్యదర్శి చింత కింది కృష్ణమూర్తి నేత, శ్యామల పరమేశ్వరి నేత, గూడెల్లి సత్యనారాయణ నేత, కారంపూడి చంద్రయ్య నేత ఇతరులు పాల్గొన్నారు.