స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు
ఎల్తూరి సాయికుమార్ స్వేరో
హన్మకొండ, నేటిధాత్రి:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల దగ్గరకు వివిధ ఎస్సీ హాస్టల్లో సమస్యలపై చర్చించడానికి వెళ్లినటువంటి విద్యార్థి సంఘ నాయకుడైన ఎల్తూరి సాయికుమార్ స్వేరో చర్చిస్తూ సందర్భంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ మోతిలాల్ గురించి చర్చ వచ్చిన సందర్భంలో డిప్యూటీ డైరెక్టర్ నిర్మల ఫోన్ చేసి విద్యార్థి సంఘాలు మీరు విధులు నిర్వర్తిస్తలేరు అంట అని మీపై కంప్లైంట్ చేస్తున్నారు అనగా అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడడం జరిగింది.
అమృత థియేటర్ వెనుకాల షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలుర వసతిగృహం వార్డెన్ మోతిలాల్ నిర్మలతో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ను తీసి విచారించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ నిర్మల వార్డెన్ మోతిలాల్ ను విధుల నుంచి పూర్తిగా తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో సాయి ప్రదీప్ అభిషేక్ ప్రణయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.