
గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వార్డులో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి
భద్రాచలం నేటి ధాత్రి
గ్రామపంచాయతీలో ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలి
మురుగు నీటి వ్యవస్థ పై శాశ్వతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి
గ్రామ సభలో ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ భద్రాచలం గ్రామపంచాయతీలో జరుగుతున్న గ్రామసభ లో భద్రాచలం పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై అన్ని వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అదేవిధంగా గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ప్రతి వార్డులో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజా ఆరోగ్యాన్నిh కాపాడాలని గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మురుగు కాలువల మరమ్మతులు చేయడం ద్వారా వర్షాకాలం రోడ్ల మీదికి వరదరాకుండా . మురుగు నీటి వ్యవస్థ పై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వివిధ ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి దామోదర్ రావు కి వినతి పత్రం సమర్పించారు..
సందర్భంగా రెవిన్యూ డివిజన్ అధికారి వినతి పత్రం తీసుకొని సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు.
ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో బిఆర్ఎస్ మండల నాయకులు డానియల్ ప్రదీప్. కాపుల సూరిబాబు .గోసుల శ్రీనివాస్ .నరసమ్మ ఆదివాసి నాయకుడు కోర్స చిట్టిబాబు దొర ఉన్నారు