భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలం భారీ వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం మధ్యాహ్నం 16 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఏడు గంటలకు 18.5 అడుగులకు చేరుకుంది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు జలవరుల శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో భారీవర్షాలు కురవడం వల్ల తాళిపేరు ప్రాజెక్టుకు భారీ వరద చేరుతున్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లు పూర్తిగా , 21 గేట్లు 2 అడుగులు మేర ఎత్తివేయడంతో 68 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. దీంతో భద్రాద్రి వద్ద గోదావరి గురువారం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు
