పరకాల నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన క్రిమినల్ చట్టాలలో కొన్ని ప్రొవిజన్స్ లోపాలు భూయిష్టంగా ఉన్నాయని ఢిల్లీలోని ఆల్ డిస్ట్రిక్ట్ కోర్టుల బార్ అసోసియేషన్ పిలుపుమేరకు సోమవారం పరకాల న్యాయవాదులు తమ విధులకు వెళ్లకుండా స్థానిక కోర్టు ముందు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందుల స్వామి మాట్లాడుతూ ఇలాంటి ప్రొవిజన్స్ వల్ల చట్టాల అమలులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఇందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా అమలులోకి తెచ్చిన చట్టాలను నిపుణులచే అధ్యయనం చేయించి వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు.ఇలాంటి ప్రొవిజన్స్ వల్ల కక్షిదారులకు జరిగే అసౌకర్యాన్ని గుర్తించి సుప్రీంకోర్టు మరింత లోతుగా ఈ అంశాలను పరిశీలించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల స్వామి,సీనియర్ న్యాయవాదులు ఒంటేరు రాజమౌళి,శ్రీనివాస్,కూకట్ల శ్రీనివాస్,గండ్ర నరేష్ రెడ్డి,వేణు, లక్కం శంకర్,రాజు,రమేష్, రాహుల్ విక్రమ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నూతన చట్టలకు వ్యతిరేకంగా పరకాల న్యాయవాదుల నిరసన
