నిజాంపేట ,నేటి దాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన బాజే లావణ్య w/o గణేష్ అనే మహిళ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి స్కూటీ పై వస్తున్న సమయంలో తూప్రాన్ సమీపంలో యక్సిడెంట్ అయి మరణించింది. ఇట్టి విషయం తెలవగానే ఆ రోజు మైనంపల్లి హన్మంతరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ రోజు చనిపోయిన లావణ్య కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నందున వారి భవిష్యత్తు కోసం ఒక లక్ష రూపాయల ఫిక్స్ డిపాజిట్ కు ఆమె భర్త గణేష్ కు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మైనంపల్లి వాణి అందచేసారు.