జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం. నిర్వహించడం జరిగింది.ఈ ప్రోగ్రాం లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత ముఖ్యఅతిథిగా పాల్గొని పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత గురించి,అంగన్వాడి కేంద్రం ప్రాముఖ్యత గురించి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, మహిళలకు వివరించి 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలని, అంగన్వాడి అనేది పిల్లలకు అమ్మ ఒడి లాంటిదని సూచించడం జరిగింది.అంగన్వాడి కేంద్రం ఆట పాటలతో కూడిన నాణ్యమైన విద్య మరియు పిల్లల వయస్సు తగిన శారీరక పెరుగుదల, విజ్ఞాన, వికాస అభివృద్ధికి నిలయమని పేర్కొనడం జరిగింది.అంగన్వాడి బడి బాట గురించి ర్యాలి తీయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్.కవిత, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ ప్రేమల,అంగన్వాడి టీచర్ ఉమాదేవి, ఉపాధ్యాయులు,పిల్లలు,గర్భిణీ స్త్రీలు,బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.