
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి కొత్తగా నిర్మాణంలో ఉన్నందున తాత్కాలికమైన రోడ్డును ఏర్పాటు చేసి పరకాల నుండి హనుమకొండకు వెళ్ళు ప్రజలందరూ ఇట్టి రోడ్డు నుండి పోయేవారు కానీ అట్టి నిర్మాణంలో ఉన్న రోడ్డు తెగిపోవడంతో అట్టి బ్రిడ్జి వద్దకు తహసిల్దార్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసిల్దార్ ఆర్ సత్యనారాయణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లావుడియా హేమా నాయక్ పరిశీలించడం జరిగింది. ఇట్టి రోడ్డు నుండి ప్రజలు ఎవ్వరు ప్రయాణించవద్దని ఇట్టి రోడ్డును నిలుపుదల చేయడం జరిగింది కావున ప్రజలందరూ గమనించి సహకరించ వలసిందిగా కోరుచున్నాము.