ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి
భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ అధికారికి వినతిపత్రం అందజేత
బానోత్ శ్రీనివాస్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి భారతీయ జనతా పార్టీ నాయకులు బానోత్ శ్రీనివాస్ నాయక్ భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బానోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజన విద్యా గురుకులు యువజన కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు పైన అధికారులు దృష్టి సారించాలనీ కోరారు ముఖ్యంగా భద్రాచలం ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించాలనీ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోనీ ఉన్న 11వార్డును చిట్టి రామవరం తండాను గ్రామపంచాయతీగా గుర్తించాలనీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమనీ 1/70 1/59 పిసా చట్టం రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో గుర్తింపు పొంది ఉన్నాయని కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్నారని 11వార్డు చిట్టి రామవరం తండాను మునిసిపాలిటీలో కలపటం వలన గిరిజనుల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిపోయారని అన్నారు భద్రాచలం ఐటిడిఎ ద్వారా గిరిజనులు సంవత్సరానికి రెండు పంటలు పండించాలనీ లక్ష్యంతోనే ఆనాడు ప్రభుత్వాలు గిరివికాస్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు రానున్న రోజుల్లో గిరి వికాస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు పరచాలనీ కోరారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు మా చిట్టిరామవరం తండాను గ్రామ పంచాయతీగా గుర్తించాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలనీ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ రాజ్ కుమార్ నాయక్ లక్ష్మణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు