జైపూర్,నేటి ధాత్రి:
భీమారం మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన అనపర్తి చందన అనే వివాహిత వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. చందనకు అదే గ్రామానికి చెందిన జంపన్నతో గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం జరగగా పెళ్లయిన మూడు నెలల తర్వాత వరకట్నం కోసం భర్త, అత్తమామ, ఆడబిడ్డ వెంకటమ్మ మానసికంగా వేధించేవారు. దీంతో ఈ నెల 7న పురుగుల మందు తాగగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.