
భద్రాచలం నేటి ధాత్రి
హైదరాబాదులోని బొటానికల్ గార్డెన్ లో ఫారెస్ట్ కార్పొరేషన్ అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పొదెం వీరయ్య సోమవారం పరిశీలించారు.
ఫారెస్ట్ కార్పొరేషన్ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఫారెస్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. నర్సరీలు, బీడీ ఆకుకు సంబంధించిన వివరాలను చైర్మన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ ఫారెస్ట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంచి పనులు చేపట్టాలని, వాటి వల్ల సమాజానికి మేలు కలిగేలా చూడాలని అధికారులను కోరారు. వివిధ పనులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని, కాలానుగుణంగా ఈ ప్రణాళికలను అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల సంరక్షణ బాధ్యత అందరి పైన ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడి ఏకో టూరిజం శ్రీ రంజిత్ నాయక్, ఫారెస్ట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ స్కై లాక్స్, ఫారెస్ట్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు