డాక్టర్ కారం మధు
కరకగూడెం,,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గాంధీనగర్ గ్రామంలో శనివారం రోజున డాక్టర్ కారం మధు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మలేరియా, డెంగ్యూ జబ్బులను నివారించుటకు ప్రజ లంత తమ బాధ్యతగా చైతన్యవతంతో తమ ఇండ్లలో గోళాలు డ్రమ్ములు ప్లాస్టిక్ డబ్బాలలోని నీటిలో తోక పురుగులు దోమల లార్వాలు లేకుండా క్లీన్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణ నరసింహ ఏఎన్ఎం విజయలక్ష్మి ఆశాలు పాల్గొనడం జరిగింది