వీణవంక ,(కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక అధ్యక్షునిగా తిప్పని సమ్మయ్య, ఉపాధ్యక్షునిగా రమేష్ సదానందం మొగిలి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కార్యదర్శిగా ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్దార్ సర్వాయి పాపన్న సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైన సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గౌడ సంఘ అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడతానని, ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌడ సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్,నూతనంగా ఎన్నికైన సభ్యులు, గీత కార్మికులు పాల్గొన్నారు.