సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్లకు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ కె. పున్నం చందర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఇన్స్ ఫైరింగ్ సైకాలజిస్టు అవార్డును అందుకున్నారు. శనివారం హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం, మాజీ కేంద్రమంత్రి ఎస్. వేణుగోపాల చారి, యాక్టర్ కె.వి ప్రదీప్ ల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆత్మహత్యల నిరోధంపై తాను చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా అనుసరణీయంగా ఉందని పలువురు వక్తలు ఆయన ను అభినందించారు. అవార్డు రావడం పట్ల పున్నం చందర్ ను సైకాలజిస్ట్ అల్వాల ఈశ్వర్, ఆడెపు వేణు, అయ్యప్ప రాము, ఎలగొండ ఆంజనేయులు, జె ఎస్ అరవింద్, వాసాల హరిప్రసాద్ లు అభినందించారు.