నేటిధాత్రి, వరంగల్
ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన ఇమ్మడి మధుకర్ అనే వర్తక వ్యాపారి, సుమారు 12 సం,లు గా బాలాజీ నగర్ లో శ్రీ కనకమహాలక్ష్మీ ట్రేడర్ పేరుతో అడ్తిదారుల నుండి మొక్కజొన్నలు, నూకలు కొనుగోలు చేసి, కమిషన్ కింద అమ్ముకునే వాడు. ఇదే క్రమంలో అడ్తిదారులను నమ్మించి వారి వద్ద నుండి వ్యాపారం పేరుతో సుమారుగా 3కోట్ల రూపాయలు మోసం చేసి, రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా పరారీలో ఉన్నడని, ఈ నేపధ్యంలో భాదితుడైన జూలూరి కృష్ణమూర్తి అనే వ్యాపారి ఏనుమామూల పోలీస్ స్టేషన్లో పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం శుక్రవారం రోజున అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏనుమామూల ఇన్స్పెక్టర్, పులి రమేష్ తెలిపినారు. ఇట్టి కేసు ఛేదించడంలో ఎస్ఐ లు శ్రీకాంత్, నరసింహరావు మరియు సిబ్బంది చురుకు పాత్ర వహించారు.